క్రైమ్/లీగల్

రూ.100 కోట్ల ఆస్తులు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బకాయిల చెల్లింపునకు పటిష్ట, ఆచరణయోగ్యమైన ప్రతిపాదనతో ముందుకు రావాలని ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు లేఖ రాసిన నేపథ్యంలో ఈడీ చర్యలు ఊపందుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో దర్యాప్తు ఉధృతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఈ కేసులో ప్రధాన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. తప్పుడు పత్రాలు సమర్పించి కొందరు అధికారులతో కుమ్మక్కయి వేలాది కోట్ల రూపాయల రుణాలు పొంది ఎగ్గొట్టారని, హవాలా మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, అతడి బంధువు, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ ఛోక్సీలకు చెందిన రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపచేసింది. నగదు డిపాజిట్లు, షేర్లు, విలాసవంతమైన కార్లను జప్తు చేసింది. మరోవైపు నిందితులకు చెందిన వివిధ సంస్థల కార్యాలయాలపై వరుసగా ఎనిమిదవ రోజూ దాడులు కొనసాగాయని ఈడీ అధికారులు వెల్లడించారు. కాగా హైదరాబాద్ సెజ్‌లో గీతాంజలి జెమ్స్‌కు చెందిన 1200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి అటాచ్ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. కాగా పీఎన్‌బీ కుంభకోణంలో కీలక సూత్రధారి నీరవ్‌మోదీని తమ ముందు హాజరవ్వాల్సిందిగా ఈడీ ఇచ్చిన సమన్లు జారీ చేసింది. అయినా ఇంతవరకు అతడు విచారణకు హాజరుకాలేదు. కాగా పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో పాలుపంచుకోవాలని, ముంబైలో ఈనెల 26న చేపట్టే విచారణకు హాజరవ్వాల్సిందిగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్) కింద గురువారం మరోసారి సమన్ ఇచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో నీరవ్‌మోదీ, ఛోస్కీల పాత్రపై దర్యాప్తు చేస్తున్న అధికారికి మోదీ ఓ లేఖ రాశారని, తన పాస్‌పోర్టును తాత్కాలికంగా రద్దు చేసినందున, ఇతర వ్యాపార కార్యక్రమాలు పూర్తికానందున విచారణకు హాజరు కాలేకపోయినట్లు ఆ లేఖలో నీరవ్ మోదీ పేర్కొన్నారని ఈడీ అధికారులు తెలిపారు. కుంభకోణం కారణంగా నష్టపోయిన మొత్తాన్ని చెల్లించడానికి పటిష్టమైన, ఆచరణయోగ్యమైన ప్రతిపాదనతో ముందుకు రావలిసిందిగా నీరవ్‌మోదీని పీఎన్‌బీ కోరడం ఈ కేసులో తాజా పరిణామం. కాగా బ్యాంకుల వైఖరి కారణంగా బకాయిలు చెల్లించలేకపోతున్నానంటూ నీరవ్‌మోదీ రాసిన మెయిల్‌కు జవాబిస్తూ పీఎన్‌బీ అధికారులు ఈ లేఖ రాశారు.
తాజా దాడుల్లో మెహుల్ ఛోస్కీకి చెందిన రూ.86.72 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, మోదీ గ్రూపునకు చెందిన రూ.7.80 కోట్ల విలువైన షేర్లు, ఫండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ 94.52 కోట్లు కాగా విలాసవంతమైన నాలుగు చక్రాల వాహనాల విలువతో కలిపి మొత్తం వంద కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లయిందని వారు తెలిపారు. మొత్తం మీద ఇప్పటివరకు వివిధ దర్యాప్తు సంస్థలు సీజ్ చేసిన ఆస్తుల విలువ రూ. 5,826 కోట్లుగా అధికారులు నిర్ధారించారు.