క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ఆదిలాబాద్ మున్సిపల్ డీఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసులో ఆదిలాబాద్ మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ పి.కొండల్‌రావు ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి, అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆదిలాబాద్, కరీంనగర్, కొత్తగూడెంలో ఏకకాలంలో జరిపిన దాడుల్లో సుమారు రూ.8కోట్ల విలువైన అక్రమ ఆస్తులు బయటపడ్డట్టు ఏసిబి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే గత మూడేళ్ళుగా ఆదిలాబాద్‌లో పనిచేస్తున్న మున్సిపల్ డిఈ కొండల్‌రావుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసి సస్పెండ్ అయిన కొండల్‌రావు ఆదిలాబాద్‌లో డి ఈగా పనిచేస్తూనే అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం రావడంతో ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్, కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు గురువారం ఉదయం ఆదిలాబాద్‌లోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న కొండల్‌రావు ఇంటిపై దాడి చేసి రికార్డులు స్వాదీనం చేసుకున్నారు. ఈ ఆకస్మిక దాడుల్లో 2.60లక్షల నగదు, 12 తులాల బంగారు నగలు, కీలక డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో కొండల్‌రావు మామగారైన కొత్తగూడెంలోను దాడులు నిర్వహించినట్టు ఏసీబీ పోలీసులు తెలిపారు. వరంగల్‌లోని తన సొంత నివాసానికి వెళ్ళగా అక్కడ తాళం వేసి ఉండడంతో సీజ్ చేసినట్లు తెలిసింది.
ఇంట్లో సోదాలు జరిపితే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. కాగా ఏసీబీ సిబ్బంది దాడుల అనంతరం ఆదిలాబాద్‌లో నివసిస్తున్న కొండల్‌రావును అదుపులోకి తీసుకొని కరీంనగర్ కోర్టుకు తరలించారు.