క్రైమ్/లీగల్

కేంద్ర మంత్రిపై రేప్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఆగస్టు 10: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రాన్ గోహైన్‌పై అత్యాచారం కేసు నమోదైంది. 1999 నుంచి బీజేపీ ఎంపీగా ఉంటున్న ఆయనపై ఈ నెల 2వ తేదీన 26 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసినట్లు నాగాన్‌పోలీసులు చెప్పారు. తనపై కేంద్ర మంత్రి గోహైన్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆ యువతి ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో కేంద్ర మంత్రి వయస్సు 68 సంవత్సరాలు. నాగాన్ సదర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ శంకర్ బ్రాటా రైమేదీ చెప్పారు. ఈ కేసులో యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అవసరమైతే ఈ కేసులో అరెస్టు చేసేందుకు కూడా వెనకాడమని పోలీసులు చెప్పారు. ఈ కేసులో కేంద్ర మంత్రిని కూడా ప్రశ్నిస్తామన్నారు. ఈ విషయమై మంత్రి భార్యను ప్రశ్నిస్తే మాట్లాడేందుకు నిరాకరించారు. కగా కేంద్రమంత్రి గోహైన్‌పై వచ్చిన అభియోగాల తీవ్రత దృష్ట్యా వెంటనే రాజీనామా చేయాలని కేఎంఎస్‌ఎస్ చీఫ్ అఖిల్ గోగాయ్ డిమాండ్ చేశారు.