క్రైమ్/లీగల్

ఆరుషి కేసు విచారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి, సేవకుడు హేమరాజ్ హత్య కేసులో దంత వైదులు రాజేష్, నుపూర్ తల్వార్‌ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ అలహాబాద్ హైకోర్టు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సేవకుడు హేమరాజ్ భార్య కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించాలని కోరారు. ఈ రెండు పిటిషన్లను విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ సిన్హా, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2008 మే నెలలో ఆరుషి అనే 14 ఏళ్ల బాలిక తన ఇంట్లోని బెడ్‌రూంలో శవమై తేలింది. ఈ కేసులో హేమరాజ్ అనే సేవకుడు ముందు మిస్సయ్యాడు. కాని రెండు రోజుల తర్వాత ఇంటి మేడపైన శవమై కనిపించాడు. ఈ ఘటన నోయిడాలో జరిగింది. ఈ కేసును యూపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది.