క్రైమ్/లీగల్

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 10: : ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వెళ్లిన స్నేహితుడి వివరాలు చెప్పాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఓ యువ కుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుం ది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మాచన్‌పల్లికి చెం దిన శ్రీకాంత్, అంజి చిన్ననాటి నుంచి స్నేహితులు. అంజి ఓ యువతిని ప్రేమించి ఎక్కడికో తీసుకె ళ్లాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు తమ అమ్మాయి కనిపించడం లేదని, తమకు అంజిపైనే అనుమానమని చెప్పడంతో పోలీసులు అంజి కోసం కనిపించగా అతడు కూడా లేడని తెలిసింది. దీంతో యువతి కుటుంబసభ్యులు వారిద్దరూ ఎక్కడికి వెళ్లారో అంజి స్నేహితుడు శ్రీకాంత్‌కు తెలుసునని చెప్పడంతో పోలీసులు శ్రీకాంత్‌ను స్టేషన్‌కు పిలిపించి, వారెక్కడ ఉన్నారో చెప్పాలం టూ శ్రీకాంత్ ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ స్థానిక ఆర్‌టీఐ కార్యాలయం వద్ద ఉన్న రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.