క్రైమ్/లీగల్

ఈ అత్యాచారాలకు అంతం ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని శరణాలయాలో ఉంటున్న మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు వాటికి అంతం ఎప్పుడని ఆహ్రంతో ప్రశ్నించింది. అనాథ శరణాలయాల్లోని పిల్లలపై అత్యాచారాలు, లైంగిక దాడులకు సంబంధించి విచారణ చేపట్టిన జస్టిస్‌లు మదన్ బి లోకుర్, ఎస్.అబ్దుల్ నజీర్, దీపక్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. యూపీలోని ప్రతాప్‌నగర్‌లోని శరణాల యం నుంచి 26 మంది మహిళలు అదృశ్యమైనట్టు వార్తలొచ్చాయని, నిన్న అదే శరణాలయంలో పలువురిపై అత్యాచారం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని, వీటిని ఎలా అరికట్టాలి, వీటికి అంతం ఎప్పడు? అని జస్టిస్ లోకుర్ ప్రశ్నించారు. అలాగే బిహార్‌లోని ముజఫర్‌పూర్, యూపీలోని డెయోరియాలో ఎన్జీవోల ఆధ్వర్యంలో నడుస్తున్న శరణాలయాలలో జరుగుతున్న అకృత్యాలను ఈ సందర్భంగా బెంచి ప్రస్తావించింది. దేశంలోని పిల్లల సంరక్షణాలయాల లిస్టును, వాటి సోషల్ ఆడిట్ రిపోర్టులను కేంద్రం సమర్పించాలని కోర్టు తరఫున సలహాదారుగా ఉన్న అడ్వకేట్ అపర్ణ్భాట్ కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం హాజరై చర్యలు చేపట్టేవరకు తామే అన్ని కార్యాలు చక్కబెట్టలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రం తరఫున కౌన్సిల్ ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి మహిళ, శిశు సంక్షేమానికి సంబంధించిన వారు మాత్రమే హాజరు కావాలని బెంచ్ పేర్కొంది. పిల్లల సంరక్షణాలయాలకు సం బంధించి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి (ఎన్‌సీపీసీఆర్) ద్వారా సోషల్ ఆడి ట్ నిర్వహించి తమకు సమర్పించాలని గతేడాది సుప్రీం తన తీర్పులో పేర్కొందని అపర్ణ్భాట్ తెలిపారు. అయితే ఎన్‌సీపీసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమానికి కొన్ని రాష్ట్రాలు పూర్తిగా సహకరించడం లేదని తెలిపారు. ముఖ్యంగా బిహార్, యూపీ రాష్ట్రాలు ఈ విషయంలో పూర్తి సహాయనిరాకరణ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్‌సీపీసీఆర్ డెయోరియాలో సామాజిక సర్వే ఏమన్నా చేపట్టిందా అన్న బెంచ్ ప్రశ్నకు బిహార్, యూపీ, మే ఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో సర్వే చేపట్టడానికి తమకు అనుమతి లభించలేదని ఎన్‌సీపీసీఆర్ ప్రతినిధి కోర్టుకు విన్నవించారు. దీనిని బట్టి చూస్తే ఆయా రాష్ట్రాలు ఏదో దాయడానికి ప్రయత్నిస్తున్నాయని అపర్ణ్భాట్ తెలిపారు. పిల్లలకు సంబంధించిన వివరాలు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలకు సంబంధించిన డాటాబేస్‌ను వెల్లడించే మేనేజ్‌మెంట్ ఇన్ఫర్‌మేషన్ సాఫ్ట్‌వేర్ (ఎంఐఎస్)ను అభివృద్ధి చేయాలన్నారు. దీనిపై కేంద్రం తరఫున ప్రతినిధి మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు కావాల్సిన సమాచారాన్ని వారం రోజుల్లో సమర్పిస్తామన్నారు. పిల్లల శరణాలయాలకు సంబంధించి ఇంకా కొన్ని వివరాలు రాష్ట్రాల నుంచి రావాల్సి ఉందన్నారు. దీంతో కోర్టు కేసును ఈ నెల 21కి వాయిదా వేసింది.