క్రైమ్/లీగల్

ఎక్సైజ్ ఎస్సై ఇంట్లో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 10: ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయలు గడించిన ఎస్సై ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.20కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. చిత్తూరు నగరంలో జరిగిన ఈ దాడులు కలకలం సృష్టించాయి. చిత్తూరు నగరానికి చెందిన విజయకుమార్ కర్నూలు జిల్లాలో ఎక్సైజ్‌శాఖలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని గుర్తించిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో చిత్తూరుతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. విజయకుమార్ గతంలో చిత్తూరు జిల్లాలో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. అప్పట్లో స్పిరిట్‌ను అక్రమంగా తరలిస్తూ పట్టుబడటంతో విజయకుమార్‌పై అధికారులు సస్పెండ్ చేశారు. తిరిగి విధుల్లో చేరిన ఆయన పదోన్నతి పొంది ఎస్సైగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఆయన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు చిత్తూరు నగరంలోని కాజూరులో ఉన్న ఆయన ఇంటిపై ఏసీబీ ఏఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ 5.70 లక్షల నగదు, బంగారునగలు, వెండి వస్తువులు, కోట్లాది రూపాయల విలువచేసే ఇంటిస్థలాల డాక్యుమెంట్లు, పలు బ్యాంకుల పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ 20 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఎక్సైజ్ ఎస్సై ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు స్వాధీనం చేసుకోవడం చర్చినీయాంశంగా మారింది. ఈ ఆస్తుల వివరాలను విజయకుమార్ ద్వారా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతనికి చిత్తూరులోనే సుమారు రూ 20కోట్లు వరకు అక్రమ ఆస్తులు వెలుగు చూడటంతో, ఇతర ప్రాంతాల్లో మరింత ఆస్తులు ఉన్నాయన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.