క్రైమ్/లీగల్

మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, ఆగస్టు 10: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్య చేసి బావిలో పడేశాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కుదాభక్షిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంకతో మర్రిగూడ మండలం వెంకేపల్లికి చెందిన మోర హన్మంతు 2004లో పెద్దలను కాదని ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. తొమ్మి దేళ్లుగా అక్క కోసం హైదరాబాద్‌లో వెతుకుతున్న తమ్ముడు ఉపేందర్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా బావ సొంత గ్రామమైన వెంకేపల్లికి వెళ్లి ఆరా తీయగా త న అక్కను బావే హత్య చేసినట్లు తెలుసుకున్నాడు. వెంటనే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసును మర్రిగూడ బదలాయించారు. పోలీసులు నిందితుడు హన్మంతును అదుపులోకి విచారించగా భార్య ప్రియాంకను తానే హత్య చేసి పాడుబాడిన బావిలో పడవేసి, పిల్లలను విక్రయించినట్లు అంగీకరించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.