క్రైమ్/లీగల్

కన్ను పడితే.. కారు మాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఏడాది వంద కార్లు అపహరించడం అతని టార్గెట్. అది కూడా మామాలు కార్లు కాదండోయ్.. లగ్జరీ కార్లే. అతని కన్ను ఏ లగ్జరీ కారుపై పడినా అది క్షణాల్లో మాయమవుతుంది. ఇలా గత ఐదేళ్ల అతను దొంగిలించిన లగ్జరీ కార్లు 500 వరకు ఉన్నాయి. కార్లను దొంగిలించిన తర్వాత దేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో మారుపేర్లతో విక్రయించడం అతని హాబీ. తరచూ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలోనే రాకపోకలు సాగిస్తుంటాడు. కార్లను విక్రయించగా వచ్చిన డబ్బుతో తన ముఠాలోని సభ్యులందరితో జల్సాలు చేయడం
అతని అలవాటు. విమానంలో అతని వెంట ఎప్పుడూ లాప్‌టాప్ తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా తాను టార్గెట్ చేసిన కార్లను అపహరించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలను కూడా తన వెంట ఎప్పుడూ
ఉంచుకుంటాడు. ఎట్టకేలకు ఈ కార్ల దొంగల ముఠా నాయకుడు ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలోని నంద్ నాగ్రి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల సఫ్రుద్దీన్ కార్ల దొంగల ముఠా నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగాడు. తన ముఠాలోని సభ్యులందరితో కలసి కార్లను దొంగిలించిన తర్వాత వాటిని పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విక్రయిస్తుంటాడు. లగ్జరీ కార్ల అపహరణపై పోలీసులకు సమాచారం అందడంతో ముఠా నాయకుడు సఫ్రుద్దీన్‌పై గట్టి నిఘా వేశారు. కార్ల దొంగను గుర్తించడంతోపాటు అతనిని ఛేజ్ చేసి పట్టించుకోవడంలో నగర ఇన్‌స్పెక్టర్ నీరజ్ చౌదరి, సబ్‌ఇన్‌స్పెక్టర్ కుల్దీప్ కృషి ఎంతో ఉందని నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో తెలిపారు. కాగా ఈ ముఠాను పట్టుకునేందుకు చాలారోజుల నుంచి పోలీసులు నిఘా వేయగా, జూన్ 5న వివేక్ విహార వద్ద పోలీసులపై వారు కాల్పులు జరిపారని, ఇందుకు ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నూర్ మహహ్మద్ చనిపోగా, రవి కుల్దీప్‌ను అరెస్టు చేశామని ఆయన తెలిపారు.