క్రైమ్/లీగల్

‘మూటకట్టి’న పాపం పండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, ఆగస్టు 11: ప్రేమించి పెళ్లి చేసుకున్న మోర హన్మంతు తన భార్య ప్రియాంకను పథకం ప్రకారమే దారుణంగా హత్చ చేసి నల్లగొండ జిల్లాలోని రాంరెడ్డిపల్లి గ్రామ శివారులోగల కుమ్మరోళ్లబావిగా పిలువబడే పాడుబడిన బావిలో అర్ధరాత్రి సమయంలో ప్రియాంక శవాన్ని పడవేశాడు. నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంక మృతదేహానికి సంబంధించిన ఎముకలను శనివారం పోలీసులు బావిలో నుండి వెలికితీశారు. పోలీసులు, నిందితుడు హన్మంతు, మృతురాలి సోదరుడు ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్‌లో నివాసముంటున్న ప్రియాంకను అక్కడే క్రూజర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మోర హన్మంతు 2006లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోగా.. వీరికి 2007లో మొదటి సంతానంగా బాబు, 2009 ఆగస్టు 28న రెండో సంతానంగా పాప జన్మించింది. ఈక్రమంలో పాప తనకు పుట్టలేదని అనుమానం పెంచుకొని తరచూ భార్యతో గొడవపడేవాడని, పుట్టిన పాపను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న హన్మంతు భార్యను ఒప్పించి హైదరాబాద్‌లోని ప్రియాంక కులానికి చెందిన వారికి దత్తత ఇచ్చారు. భార్య ప్రియాంకపై అనుమానం పెంచుకున్న హన్మంతు కూతురిని దత్తత ఇచ్చి 2009 డిసెంబర్ మాసంలో భార్యను హతమార్చాలని నిర్ణయించుకొని తన స్వగ్రామమైన మర్రిగూడ మండలం వెంకేపల్లి గ్రామానికి తీసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వెళ్లిన సమయాన్ని అదనుగా భావించి అదేరోజు రాత్రి ప్రియాంక గొంతుకు చీరను బిగించి హత్య చేశాడు. వెంకేపల్లి నుండి మర్రిగూడ మండలకేంద్రానికి వచ్చే రహదారి వెంట గల పాడుబడిన బావిలో అర్ధరాత్రి ప్రియాంక మృతదేహాన్ని పడవేశాడు. మరుసటి రోజు కుమారుడిని తీసుకొని కొండమల్లేపల్లిలో గల తన మేనమామకు అప్పగించాడు. ప్రియాంక సోదరుడు ఉపేందర్ పూర్తిస్థాయి సమాచారం, ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా జరిగిన ఉదంతం పోలీసులకు చెప్పడంతో పాడుబడిన బావిని మీటరు లోపలికి తవ్వారు. స్ర్తి ఆనవాళ్లతో కూడిన తల వెంట్రుకలు, పుర్రె, కాళ్లు, చేతి ఎముకలు, సెల్‌ఫోన్, చెప్పులు, గాజులు, టైరు ట్యూబ్ బావి నుండి బయటకు తీశారు. అనంతరం సంఘటనా స్థలానికి హన్మంతుని పిలిచి విచారించగా ఆ ఆనవాళ్లు తన భార్యవేనని అంగీకరించాడు. తల్లిదండ్రులు దూరమైనా.. కుమారుడు రాంచరణ్ మల్లేపల్లిలో, కుమార్తె రిషిత హాలియాలో చదువుకుంటూ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తోడ పుట్టిన అక్క ప్రేమపెళ్లి చేసుకున్న నేపథ్యంలో క్షేమంగా ఉండాలని కోరుకున్న తమ్ముడు ఉపేందర్ తన అక్క కనిపించకపోవడంతో డిటెక్టివ్‌గా మారి పూర్తి వివరాలు సేకరించాడు. తొమ్మిది సంవత్సరాలుగా అక్క జాడ కోసం అనే్వషించి చివరకు ఫేస్‌బుక్ ఖాతా ద్వారా బావ గురించి తెలుసుకొని వెంకేపల్లికి వచ్చాడు. దారుణ హత్యకు గురైన ప్రియాంక అవశేషాలు వెలికితీసే క్రమంలో మృతురాలి తమ్ముడు ఉపేందర్ ఘటనా స్థలంలో కనిపించకపోవడం అక్కడికి వచ్చిన వారిలో చర్చనీయాంశంగా మారింది.