క్రైమ్/లీగల్

ఇద్దరు యువతుల అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాతబస్తీ), ఆగస్టు 11: విజయవాడలోని కొత్తపేట, భవానీపురం పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యం కాగా పోలీసులు కేసులు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గొల్లపూడి మైలురాయి సెంటర్‌కు చెందిన యువతి (19) అదృశ్యం కాగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అనే యువకునిపై అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలావుండగా ఇస్లాంపేటకు చెందిన మరో యువతి (19) రెండు రోజుల నుండి కన్పించడం లేదు. ఇంట్లో నుండి దుస్తులు, రూ. 5వేలు నగదు తీసుకెళ్లిందని యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు శనివారం ఉదయం కేసు నమోదు చేశారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాఉంటే 2016లో అదృశ్యమైన గొల్లపూడికి చెందిన మహిళ (27)ని హైదరాబాద్ పఠాన్‌చెరువు ప్రాంతంలో గుర్తించిన భవానీపురం ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆమెను భర్తకు శనివారం అప్పగించారు.