క్రైమ్/లీగల్

హంద్రీనీవాలో గల్లంతైన యువకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఫిబ్రవరి 23 : పట్టణ శివారు ప్రాంతంలోని జీ.కొట్టాల వద్ద హంద్రీనీవా కాలువలో ఎస్.మోహన్(25) శుక్రవారం గల్లంతైనట్లు మిత్రులు తెలిపారు. భాగ్యనగర్‌కు చెందిన మోహన్ మిత్రులతో కలసి ఈతకు వెళ్లాడు. దీంతో ఈత కొడుతూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బంది, రూరల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సాయంకాలం వరకూ మోహన్ కనిపించలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

వ్యక్తి అనుమానాస్పద వ్యక్తి
గుత్తి, ఫిబ్రవరి 23 : మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్‌ఎస్ రోడ్డులో నివాసం ఉండే రామాంజులురెడ్డి (55) శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి కుమారుడు భాస్కర్‌రెడ్డి అందించిన వివరాల మేరకు రామాంజులురెడ్డి విధి నిర్వహణలో భాగంగా పనులు ముగించుకుని గురువారం రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రపోయాడు. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి భాస్కర్‌రెడ్డికి ఫోన్ చేసి మీ తండ్రి మృతి చెందాదంటూ సమాచారం అందించాడు. తండ్రి మృతిపై పలు అనుమానాలు ఉన్నట్లు భాస్కర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
బెళుగుప్ప, ఫిబ్రవరి 23 : మండల పరిధిలోని దుద్దేకుంటకు చెందిన సాయికుమార్ (19) గురువారం అనంతపురంలో విషపుగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెళుగుప్ప పోలీసులు తెలిపిన వివరాల మేరకు దుద్దేకుంటకు చెందిన తండ్రి నరసింహులు, తల్లి త్రివేణితోపాటు సాయికుమార్ కొన్ని రోజులుగా కుటుంబంలోని ముగ్గురూ అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఇందులో భాగంగానే అనంతపురంలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లిన తల్లిని చూసి మనస్థాపానికి గురై విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.