క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 11: జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి - విజయవాడ మార్గంలో కొలనుకొండ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆగి ఉన్న లారీని పెట్రోలు ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ట్యాంకర్ నుంచి మంటలు వ్యాపించి ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్ అద్దోని ఎర్రప్ప (33) సజీవ దహనమయ్యాడు. క్లీనర్ ఏసుబాబు తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లి పోలీసుల కథనం ప్రకారం ఆగి ఉన్న లారీని ట్యాంకర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందిన డ్రైవర్ ఎర్రప్ప బళ్లారి ప్రాంతానికి చెందిన వ్యక్తి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.