క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం,, ఆగస్టు 11: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈనెల 14 నుంచి విశాఖ జిల్లాలో పాదయాత్రకు వస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు స్వాగతం పలికేందుకు ఆపార్టీ శ్రేణులు చేస్తున్న ఏర్పాట్లలో అపశ్రుతి చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని విశాఖ జిల్లా ముఖద్వారమైన గన్నవరం మెట్ట వద్ద జగన్‌కు స్వాగతం పలికేందుకు శనివారం గన్నవరం గ్రామం వద్ద ఫ్లెక్సీ కడుతుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందాడు. నాతవరం ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గన్నవరం మెట్ట గ్రామానికి చెందిన చింతకాయల నూకరాజు((34) ఫ్లెక్సీలు కడుతుండగా ఫ్లెక్సీకి ఉన్న ఐరన్ ఊసకు విద్యుత్ వైర్ తగలడంతో షాక్‌కు గురై కిందపడిపోగా తలకు బలమైన గాయమైంది. వెంటనే నర్సీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.