క్రైమ్/లీగల్

ఇద్దరు ఐసిస్ ఏజెంట్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తూ హైదరాబాద్‌లో స్థావరాల కోసం ఐసిస్ యువకులు చేస్తున్న కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఛేదించారు. ఐసిస్ సానుభూతిపరులు మహమ్మద్ అబ్దుల్లా బాసిత్ (24) మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ (19)ను ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఇద్దరు యువకులు ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఉగ్రవాదుల సంస్థలతో తరచుగా సంప్రదిస్తున్నారని ఎన్‌ఐఏ విచారణలో బయటపడింది. 2016లో అబుదబీలోఐసిస్ మోడ్యుల్ కేసులో అరెస్టు అయిన ప్రధాన ఉగ్రవాది ఆదాన్ హుసేన్‌తో అరెస్టు అయిన యువకులు తరచుగా సంప్రదిస్తున్నారు. అరెస్టయిన యువకుల నుంచి భారీగా పేలుళ్ళకు సంబంధించి మందుగుండు సామాన్లను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. 2016లో జాతీయ దర్యాప్తు సంస్థ శిఖాఅజార్ ఉల్ ఇస్లామ్, మహమ్మద్ ఫారన్ శిఖా, ఆదాన్ హుషేన్‌లను అరెస్టు చేసింది. అబుదబీలో ఉన్న ఉగ్రవాదుల సంస్థల ఆదేశాలతో భారత్ దేశంలో విధ్వంసక ఘటనలను ప్రేరేపించడానికి ముస్లిం యువకులకు శిక్షణ ఇవ్వడానకి ఐసిస్ ప్రోత్సహిస్తోందని ఎన్‌ఐఏ అభిప్రాయడుతోంది. ఐసిస్ శిక్షణలు ఇవ్వడానికి హైదరాబాద్ పాతబస్తీ అనువుగా ఉంటుందని ఉగ్రవాదులు ఎంచుకుంటున్నారు. ఐసిస్ ఉద్దేశాలను వాటి లక్ష్యాలను అమలు చేయడానకి ఉగ్రవాద సంస్థలు ముస్లిం యువకులకు ఆదాయవనరులను సమకూర్చుతోంది. దీంతో యువకులు ఐసిస్‌పై మొగ్గుచూపిస్తున్నారు. ఉగ్రవాదుల అండతో కొత్త సభ్యులను నియమించడం, ఆధునిక సాంకేతిక పరిజానంతో బాంబు పేలుళ్ళతో విధ్వంసం సృష్టించడం, ప్రజల్ని భయాందోళన కల్గించడం వంటి అంశాలపై ముస్లిం యువకులకు ఐసిస్ శిక్షణ ఇస్తుంది. ఈనెల 6వ తేదీన హైదరాబాద్ పాతబస్తీలో జాతీయ దర్యాప్తుసంస్థ చేపట్టిన సోదాల్లో అరెస్టు అయిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరితో పాటు మరో 12 మందిని ఎన్‌ఐఏ విచారించింది. విచారణలో పట్టుబడ్డ వారినుంచి సెల్‌ఫొన్లు, లాప్‌టాప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజులుగా కొనసాగిన విచారణలో అరెస్టు అయిన ఇద్దరు యువకులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్నది విచారణలో వెలుగుచూసింది. దేశంలో అలజడి సృష్టించడానకి చేసిన కుట్రల గురించి మరింత లోతుగా విచారించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అబ్దుల్లా బాసిత్ ఐసిస్‌లో చేరడానికి ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలకు వెళుతుంటే గతంలో హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. బాసిత్ అతని కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా బాసిత్ మళ్ళీ ఐసిస్‌కు చేరువకావడానకి ప్రయత్నించి ఇప్పుడు దర్యాప్తు సంస్థకు పట్టుమడ్డారు. పట్టుబడ్డ యువకుల తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకులకు ఎలాంటి ఉగ్రవాదుల సంస్థలతో సంబంధాలు లేవని వారు వెల్లడించారు.