క్రైమ్/లీగల్

రుణాల పేరుతో మోసగించిన వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప క్రైం,్ఫబ్రవరి 23: రూపాయ వడ్డీతో రుణాలు ఇప్పిస్తామని అమాయక ప్రజలను మోసగించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ మాసూంబాషా తెలిపారు. శుక్రవారం సాయంత్రం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన అరెస్టు చేసిన పాత్రికేయుల ముందు ప్రవేశపెట్టారు. అసలు వ్యక్తి క్రాంతికుమార్, అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. క్రాంతికుమార్ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి కడప నగర సమీపంలోని చలమారెడ్డిపల్లె, ప్రొద్దుటూరు, ఖాజీపేట, చెన్నూరు తదితర ప్రాంతాల్లో తమ సొంత వాహనంలో తిరుగుతూ అమాయక ప్రజలను మభ్యపెట్టి గ్రూపులు ఏర్పాటు చేశారని డీఎస్పీ తెలిపారు. విద్యుత్ కుక్కర్లు వారికి ఎరవేసి ఒక్కొక్కటి రూ.1050లు విలువచేసే వాటిని రూ.2,600లకు అమ్ముతూగ్రూప్‌లో సభ్యులుగా చేర్చుకున్నారన్నారు. ఈ డబ్బులను ఎంత త్వరగా చెల్లిస్తే వెంటనే రూ.30వేలు లోన్ కంపెనీ నుండి ఇప్పిస్తామని నమ్మబలికారు. కంపెనీకి చెందిన మేనేజర్లు త్వరలో వస్తారని, ఈలోగా కుక్కర్ల డబ్బుచెల్లిస్తే వెంటనే లోన్ మంజూరు అవుతుందని నమ్మించారన్నారు. కొందరికి కుక్కర్లు ఇచ్చారని చాలా మందికి ఇవ్వలేదని డీఎస్పీ తెలిపారు. శుక్రవారం ఉదయం 8గంటలకు కడప బైపాస్‌రోడ్డులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వీరిని అరెస్టు చేశామని వారి నుండి ఒక ఎన్నోవా కారును, 11స్పార్ష్ గంగా కుక్కర్లను స్వాధీన పరుచుకున్నామన్నారు.