క్రైమ్/లీగల్

సంజయ్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 12: లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు సంజయ్ తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సంజయ్ రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ కుమారుడు కావడంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. తమకు అందిన ఫిర్యాదు మేరకు సంజయ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ నిమిత్తం హాజరుకావాలని సీఆర్‌పీసీ 41(ఏ) సెక్షన్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో సంజయ్ విచారణ నిమిత్తం ఆదివారం నిజామాబాద్ ఏసీపీ కార్యాలయానికి హాజరయ్యారు. ఏసీపీ
ఎం.సుదర్శన్, నగర సీఐ నగేష్, నాల్గవ టౌన్ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన మీదట ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించి అదుపులోకి తీసుకున్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం, ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో నేరుగా జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి మేరీసారా దానమ్మ నివాసానికి తీసుకెళ్లి ఆమె ఎదుట ప్రవేశపెట్టారు. సంజయ్ తరఫు న్యాయవాదులు జీవీ కృపాకర్ రెడ్డి, ఆకుల రమేష్, హైకోర్టు అడ్వకేట్ కుమార్ సమక్షంలోనే పోలీసులతో పాటు న్యాయమూర్తి కూడా విచారణను కొనసాగించారు. విచారణ ప్రక్రియ గంటల తరబడి కొనసాగడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలకు, రిమాండ్ రిపోర్టులో పొందుపర్చిన అంశాలకు పొంతన లేకపోవడాన్ని గమనించిన న్యాయమూర్తి, దానిని సరిచేసుకుని రావాలని సూచించడంతో గంటల తరబడి జాప్యం జరిగింది. అంతేగాక, సంజయ్‌పై కొత్తగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసిన దృష్ట్యా, ఈ కేసులను విచారించే కోర్టులోనే సోమవారం ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి తెలిపారు. దీనితో పోలీసులు చేసేదేమీ లేక సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో సంజయ్‌ను తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఆయనను నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఉంచినట్టు తెలిసింది. సీఆర్‌పీసీ 41(ఏ)ను అమలు చేయకుండా, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సంజయ్‌ను అరెస్టు చేశారని, జడ్జి ముందు కూడా ఆయన తనపై మోపిన అభియోగాలు నిరాధారమని వాంగ్మూలం ఇచ్చారని సంజయ్ తరఫు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాము హైకోర్టుకు నివేదిస్తామని అన్నారు.

చిత్రం..సంజయ్‌ను అరెస్టు చేసి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్న పోలీసులు