క్రైమ్/లీగల్

‘గీతాగోవిందం’ పైరసీదారుని అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 12: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీతాగోవిందం సినిమా పైరసీ బారిన పడి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టటం సంచలనం రేపిన నేపథ్యంలో గుంటూరు పోలీసులు కేసును ఛేదించి సూత్రధారుడిని అరెస్ట్ చేశారు. ఇంకా నిర్మాణం పూర్తికాని సినిమాకు సంబంధించి కొంత భాగాన్ని కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు పైరసీ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గమిటి సత్యవెంకట రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. పైరసీకి పాల్పడిన పడవల రాజేష్ అనే నిందితుడిని అరెస్టు చేసి ఆదివారం విలేఖరులకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫిలిం ఇండస్ట్రీలో డేటా డిజిటల్ సంస్థ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజేష్ వద్దకు సినీ పరిశ్రమకు చెందినవారు ఎడిటింగ్ చేయించుకునేందుకు హార్డ్‌డిస్క్‌లతో వస్తుంటారు. ఈ క్రమంలో తనవద్దకు వచ్చిన గీతాగోవిందం సినిమాకు సంబంధించిన కొంత భాగాన్ని ల్యాప్‌టాప్‌లో కాపీ చేసుకున్నాడు. అనంతరం కేఎల్ యూనివర్శిటీలో చదువుతున్న తన బంధువులు వందన, జయంత్‌లకు పెన్‌డ్రైవ్ ద్వారా అందజేశారు. జయంత్ అదే యూనివర్శిటీకి చెందిన కమల్ అనే విద్యార్థికి ఇవ్వడంతో అతను వీవీఐటీ కళాశాలకు చెందిన సాయిమహేష్‌కు అందజేశాడు. వారుకూడా తమ స్నేహితులకు సర్క్యులేట్ చేయడంతో సినిమా రిలీజ్ కాకుండానే కొన్ని సీన్లు బయటి ప్రపంచానికి తెలిసిపోయాయి. దీంతో సమాచారం అందుకున్న నిర్మాత సత్య వెంకట రామాంజనేయులు పో లీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు లో అసలు నిందితుడు పడవల రాజేష్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు హార్డ్‌డిస్క్‌లు, నాలుగు మొబైల్స్, మూడు పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.

చిత్రం..పైరసీదారు వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ ఎస్పీ విజయారావు