క్రైమ్/లీగల్

గోదాములో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 12: గుంటూరు సమీపంలోని ఆటోనగర్‌లో ఓ పొగాకు కంపెనీకి చెందిన గోదాములో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వేలాది బేళ్ల పత్తి దగ్ధమైంది. ఆదివారం వేకువజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పలువురు వ్యాపారులకు చెందిన సుమారు 6వేల పత్తిబేళ్లు దగ్ధమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటి విలువ సుమారు 10కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. బాబు టుబాకో కంపెనీ ప్రాంగణంలోని ఓ గోదాములో జరిగిన విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. గోదాము అంతటా వ్యాపించటంతో పత్తిబేళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు.
గుంటూరు, విజయవాడ నుండి వచ్చిన ఆరు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం వరకు శ్రమించాల్సి వచ్చింది. దీనిచుట్టూ మరికొన్ని గోదాములు ఉండటంతో వాటికి మంటలు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మరింత భారీ నష్టం జరగకుండా నివారించగలిగారు. అదృష్టవశాత్తూ ఇక్కడ ప్రాణనష్టం తప్పింది.

చిత్రం..గోదాములో తగలబడుతున్న పత్తిబేళ్లు