క్రైమ్/లీగల్

నకిలీ సర్ట్ఫికేట్‌తో కల్యాణలక్ష్మికి దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 13: కల్యాణలక్ష్మి పధకం కింద అనుమానాస్పద పద్దతిలో దరఖాస్తుతో పాటు సర్ట్ఫికెట్లు సమర్పించిన త్రిపురారం మండలం బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన వధువు నిమ్మల మమత తల్లి నిమ్మల లక్ష్మివి నకిలీవని తేలడంతో ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలని మండల తహసీల్దార్‌కు ఆదేశించినట్టు స్థానిక ఆర్డీఓ జగన్నాధరావు తెలిపారు. బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల లలిత వివాహం తుమ్మడం గ్రామానికి చెందిన డి.సైదులుతో జరిగింది. కల్యాణలక్ష్మి లబ్ధిని పొందేందుకు గాను దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు గాను మిర్యాలగూడ పట్టణంలోని విద్యానికేతన్ హైస్కూల్ నుండి ఒకటి నుండి ఆరో తరగతి వరకు 2003-04 నుండి 2008-09 విద్యా సంవత్సరం వరకు చదివినట్టు అదే విధంగా జన్మించిన తేది 10-6-1998గా పేర్కొనడంతో అనుమానం వచ్చిన ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి రఘునాధ్ ఆ పాఠశాల ప్రిన్సిపల్ బాబాషర్ఫోద్దీన్‌ను పిలిపించి సర్ట్ఫికెట్‌పై ఉన్న సంతకం ఎవరిదనే ప్రశ్నించగా తనది కాదని, తన అన్నది కూడ కాదని పేర్కొనడంతో ఫోర్జరి సంతకంగా గ్రహించారు. అదే విధంగా పెళ్లి ఫోటోలు రెండురకాలుగా పెట్టడంతో అనుమానం రావడంతో క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు త్రిపురారం తహసీల్దార్‌ను ఆర్డీఓ ఆదేశించారు. మొత్తం మీద పెళ్లయిన అమ్మాయి మైనర్‌గా ఉందన్న అనుమానాన్ని ఆర్డీఓ వ్యక్తం చేశారు. జనన ధృవీకరణ సర్ట్ఫికెట్ కోసం నకిలీ సర్ట్ఫికెట్ సృష్టించారని ఆర్డీఓ పేర్కొన్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.