క్రైమ్/లీగల్

లక్ష రూపాయల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 23: ఏలూరు పరిసర ప్రాంతాల్లో నిషేధించిన గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డిఎస్పీ కె ఈశ్వరరావు తెలిపారు. స్ధానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈవివరాలు తెలిపారు. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయితీ రామానగర్ కాలనీకి చెందిన మమ్ముల శ్రీహరి, లావేటివారి వీధికి చెందిన జి శివరామకృష్ణలను శుక్రవారం స్ధానిక గాంధీమైదానం వద్ద అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి ఇళ్ల వద్ధ నిల్వ చేసిన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈవిధంగా లక్ష రూపాయల విలువైన 13400 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ తెలిపారు.