క్రైమ్/లీగల్

ఆత్మకూరు ఎస్‌ఐపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 13:మహిళను వేధించిన కేసులో ఆత్మకూరు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం చేయాల్సిన రక్షణ అధికారి మహిళకు ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తుండటంతో ఆధారాలతో సహా ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో సదరు ఎస్‌ఐను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఐ సారా కేసు పేరుతో ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక మహిళను లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో బాధిత మహిళ తన భర్త, పిల్లలతో కలిసి ఎస్‌ఐ ఫోన్ చేసి వేధించిన వివరాలను, ఫోన్ నెంబర్లను ఎస్పీకి అందజేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ సిఫార్సుల మేరకు డీఐజీ శ్రీనివాసులు ఎస్‌ఐ వెంకట సుబ్బయ్యను సస్పెండ్ చేశారు.