క్రైమ్/లీగల్

చిట్‌ఫండ్ నిర్వాహకుడికి మూడేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), ఆగస్టు 13: చిట్‌ఫండ్‌ను ఎత్తివేసి కోట్ల రూపాయలు తన ఖాతాలో జమ చేసుకొని చేతులెత్తేసిన కరుడుగట్టిన ఘరానా మోసగాడు, అభయమిత్ర చిటఫండ్ నిర్వాహకుడు గుర్రం సంజీవ రెడ్డి (45)కి కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పార్థసారథి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. కేసు వివరాల్లోకి వెళితే..నగరంలోని గీతాభవన్ చౌరస్తాలో ముకరంపురా లో అభయమిత్ర చిట్‌ఫండ్‌ను స్థాపించారు. దీనిలో అనేక మందిని చందాదారులుగా, వివిధ గ్రూపులలో సభ్యులుగా చేర్పించుకున్నారు. నగరంలోని గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ సలీం, వేములవాడకు చెందిన రాజేశ్వర శర్మ, కోతిరాంపూర్‌కు చెందిన బొడిగె గాలయ్యలు ఐదు లక్షలకు చిట్టివేశారు. చిట్టికి సంబంధించిన రూపాయలు సంజీవ రెడ్డి తిరిగి చెల్లించకపోవడంతో కరీంనగర్‌లోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 2012లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేశారు. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితునిపై నేరం రుజువు కావడంతో మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు 15 వేల రూ పాయల జరిమానా విధించింది. అం తేకాకుండా అనేకమంది చాలా కాలం పాటు చిట్‌ఫండ్‌లో వారి వారి గ్రూపులలో నెలనెలా రూపాయలు మొ త్తా న్ని జమ చేసుకునేవారు. అలా చాలా నెలలు కట్టిన తరువాత కొందరు చిట్టి వేలంలో పాల్గొని చిట్టి దక్కించుకునేవారు. అనంతరం చిట్‌ఫండ్ నిర్వాహకుడు గుర్రం సంజీవరెడ్డి వారికి ఆయా రూపాయలకు సంబంధించిన చెక్కులను అందజేసేవాడు. ఇలా ఉ మ్మడి జిల్లాలో చాలా మంది సభ్యులు వారి చిట్టి ఎత్తుకున్న తరువాత చెక్కులను అందజేశాడు. సదరు సభ్యులు ఆయా చెక్కులను వారి బ్యాంక్ ఖా తాలో జమ చేసుకోగా చిట్‌ఫండ్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో సరిపడినంత డబ్బులు లేవని, ఇతరత్రా పలు కారణాల వల్ల బ్యాంక్ అదికారులు మెమోలు జారీ చేశారు. దీంతో ఖంగుతిన్న అనేక మంది సభ్యులు కష్టపడి సంపాదించి పొదుపు చేసుకొని చిట్టి వేసుకుంటే మోసపోయామని వాపోయారు. జరిగిన విషయాన్ని చిట్‌ఫండ్ నిర్వాహకుడికి తెలియపర్చుటకు చిట్‌ఫండ్ వద్దకు వెళ్లగా తాళం వేసి ఉండడంతో విస్తూపోయారు. చివరికి చేసేదేమీ లేక తమ న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించడం, వివిధ కోర్టులలో చెక్ బౌన్స్‌లు వేయడం జరిగా యి. కొంతకాలం పాటు వివిద కోర్టులకు హాజరైన సంజీవ రెడ్డి చాలా మంది చిట్‌ఫండ్ సభ్యులు చెల్లించిన రూపాయల గురించి నిలదీయడంతో కోర్టుకు హాజరుకాక తప్పించుకొని తిరిగేవారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సదరు నిందితుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకొని కోర్టు అనుమతితో జైళ్లో పెట్టారు.జైళ్లో ఉండగానే న్యాయస్థానం సంబంధిత కేసులపై విచారణ చేపట్టి జైలుశిక్ష విధించింది.