క్రైమ్/లీగల్

జంక్షన్ సమీపంలో గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్‌జంక్షన్, ఆగస్టు 13: విశాఖ జిల్లా చింతపల్లి నుంచి తమిళనాడు దిండిగల్ ప్రాంతానికి ఆక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని హనుమాన్‌జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం హనుమాన్ జంక్షన్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఏలూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న మారుతివ్యాన్ (ఎపి 05బిహెచ్ 2475)ను తనిఖీలకు సమీపంలో నిలిపివేసి ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారిని వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో గంజాయి ఆక్రమ రవాణా బయటపడింది. వ్యాన్‌లో నుంచి 50 ప్యాకెట్ల గంజాయి సుమారు 300 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుడు శరవణపై కేసు నమోదు చేసి నూజివీడు కోర్టుకు తరలించినట్లు హనుమాన్ జంక్షన్ సిఐ వైవివిఎల్ నాయుడు తెలిపారు. తనీఖీల సమయంలో బాపులపాడు ఎమ్మార్వో గోపాలకృష్ణ, హనుమాన్‌జంక్షన్, వీరవల్లి ఎస్‌ఐలు సతీష్, నాగదుర్గారావులు ఇతర సిబ్బంది వున్నారు.