క్రైమ్/లీగల్

భార్యను హత్య చేసిన విశ్రాంత ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 13: భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తమని పట్టించుకోవడంలేదని.. పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బును కూడా సదరు మహిళకే ఇచ్చాడని భార్య గొడవ పెట్టుకోవడంతో ఆమెను కడుపులో కత్తితో పొడిచి హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయిన సంఘటన గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మచిలీపట్నం భాస్కరావుపురానికి చెందిన కేఎస్‌ఆర్ ఆంజనేయులు రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎస్‌ఐగా పనిచేసి నెలక్రితం పదవీ విరమణ చేశారు. ఆంజనేయులు రెడ్డికి లక్ష్మి వినీల(51), కుమారుడు శివ మనోహర్ రెడ్డితో పాటు కుమార్తె రమాప్రవళిక ఉన్నారు. కుమారుడు కొండాపూర్ గౌతమినగర్‌లోను, కుమార్తె ప్రశాంతినగర్‌లోని జాగృతి కాలనీలో నివాసముంటూ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగులుగా పని చేసుకుంటున్నారు. పదవీ విరమణ చేసిన ఆంజనేయులు రెడ్డి, భార్య వినీల వారం రోజుల క్రితం గౌతమినగర్‌లో నివాసముంటున్న కుమారుడు శివమనోహర్ రెడ్డి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులను కొండాపూర్‌లో ఉంచి కుమారుడు కోడలు బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. పదవీ విరమణ తరువాత వచ్చిన డబ్బును తమకు ఇవ్వకుండా మరో మహిళకు ఇచ్చాడని భార్య గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన ఆంజనేయులు ఉదయం రెండు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న కత్తితో నిద్రిస్తున్న భార్యను పదిసార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం కత్తిని చేతులను శుభ్రంగా కుడుక్కుని రక్తం మరకలు పడిన బట్టలను మార్చుకుని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. గౌతమినగర్ తమ పరిధిలోకి రాదని మాదాపూర్ పోలీసులు గచ్చిబౌలి తీసుకుని వచ్చి నిందితుడిని అప్పగించారు. తనని వేధిస్తుండడంతోనే హత్య చేసినట్లు పోలీసులకు ఆంజనేయులు చెప్పాడు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించారు. మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ రావు సంఘటన ప్రదేశాన్ని సందర్శించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.