క్రైమ్/లీగల్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, ఆగస్టు 14: మండలంలోని పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.చింతలవలస గ్రామానికి చెందిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిందని పెదమానాపురం పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో దత్తి విఆర్వోగా పనిచేస్తున్న డి. అప్పలకొండ సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించుకుని వస్తుండగా ఎస్. చింతలవలస గ్రామానికి చెందిన రైతులతో పాటు ఆల్తి బంగారునాయుడు తమ భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించలేదని ప్రశ్నించారు. దీంతో గ్రామానికి విఆర్వో అప్పల కొండ సమాధానం చెబుతుండగా బంగారునాయుడు వి ఆర్వోపై కలబడి తోసి వేయడంతో కిందపడిపోవడంతో గాయాలు అయ్యాయి. వెంటనే అతనిని విజయనగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెల్ విభాగం డిఎస్పీ గురుమూర్తి నాయుడు మంగళవారం పెదమానాపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు బంగారునాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.