క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలుపుల, ఆగస్టు 14: స్థానిక దిగువపేటకు చెందిన ఆశ (28) అవమానభారంతోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ నగేష్‌బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. దిగువపేటకు చెందిన షర్ఫొద్దీన్‌తో వివాహేతర సంబంధం ఉండేదని, షర్ఫొద్దీన్‌కు ఇటీవల వివాహం జరిగిందన్నారు. దీంతో ఆశ వారి కుటుంబ సభ్యులను దూషించడం మొదలుపెట్టిందన్నారు. సోమవారం షర్ఫొద్దీన్ తండ్రి నబీఖాన్‌ను ఆశ దూషించడంతో నబీఖాన్, అతని భార్య వహిదాలు కలిసి ఆశను కొట్టారన్నారు. ఇది తెలిసి కూడా ఆమె భర్త సాదిక్‌వలీ ఏమీ మాట్లాడకపోవడంతో అవమానంగా భావించి ఆమె స్వగృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. కాగా ఆశ భౌతికకాయాన్ని మంగళవారం కదిరికి తరలించామన్నారు. ఆమె మృతికి కారకులైన షర్ఫొద్దీన్, నబీఖాన్, వహిదాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.