క్రైమ్/లీగల్

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ 30 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, ఆగస్టు 14 : ఎదురెదుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో సుమారు 30 మంది తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం సాయంత్రం గార్లదినె్న మండలం కల్లూరు అగ్రహారం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుత్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి గుత్తికి వస్తుండగా, గుత్తి నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న కళ్యాణదుర్గం డిపోకు చెందిన మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ప్రయాణికులు ఒకరిపై మరొకరు పడి తీవ్రంగా గాయపడ్డారు. ఎక్కడికక్కడ శరీల భాగాలు చీలిపోయి రక్తాలు కారడంతో భయాందోళనతో పెద్దగా ఆర్థనాదాలు చేశారు. దీంతో సమీప వాసులు చేరుకుని గాయపడిన కళ్యాణదుర్గం బస్సు డ్రైవర్ సుధాకర్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులను అనంతపురం, మరికొందరిని పామిడి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో తిరుపాలు, హనుమంతరెడ్డి, తీరుపాల్‌నాయక్, రాహుల్‌బిస్వాస్, నరేష్, యుగంధర్, నిర్మల, విజయ్‌భాస్కర్, ఉమాదేవి, రాములమ్మ, కిట్టమ్మ, నాగవర్దన్‌రెడ్డి, వౌళాలి, సావిత్రి, బాలరాజు మరో ఐదుగురు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో తిరుపాల్, హనుమంతరెడ్డి, రాములమ్మ పరిస్థితి విషమంగా ఉండగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, బంధువులు రావడంతో పామిడి ప్రభుత్వాసుపత్రి దద్దరిల్లింది. కల్లుమూసి తెరిచేలోపు ప్రమాదం జరిగిందని ప్రయాణికులు వాపోయారు. బస్సులో ఎక్కడ చూసినా రక్తం పారటం.. ఎవరికేం జరిగిందో.. అసలు అందరూ ప్రాణాలతోనే ఉన్నారా.. లేదా అర్థం కాని పరిస్థితి నెలకొందని కన్నీటి పర్యవంతం అయ్యారు. కాగా విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఆర్‌ఎం చిట్టిబాబు, పామిడి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నరేంద్రరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జేసీబీతో బస్సులను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం పామిడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆర్టీసీ ఆర్‌ఎంతోపాటు వైకాపా బీసీ సెల్ జిల్లా అద్యక్షులు వీరాంజనేయులు, కౌన్సిలర్లు మానుకింద రామాంజనేయలు, వై.యూ.రామాంజనేయులు క్షతగాత్రులను పరామర్శించారు. 108 వాహనానికి పలుమార్లు ఫోన్ చేసినా సకాలంలో ప్రభుత్వాసుపత్రికి చేరుకోకపోవడంతో వీరాంజనేయులు తన వాహనంలోనే అనంతపురం తరలించారు.