క్రైమ్/లీగల్

ఆటోలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడే మహిళ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 14: గత యేడాదిన్నరగా తిరుపతిలో ఆటోలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల్లోని మహిళలను ఎంచుకుని వారి నుండి బంగారు నగలు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అట్టియంపట్టికి చెందిన రేవతి (34) అనే నిందితురాలిని మంగళవారం ఆర్టీసీ బస్టాండు వద్ద అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. రేవతి తన గ్రామానికి చెందిన ముత్తమ్మ, సెల్వి, లక్ష్మీ అనే మహిళలతో బస్సుల్లోను, ఆటోలను ప్రయాణించేదని తెలిపారు. ఈ క్రమంలో తోటిమహిళా ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు, సొత్తు, సొమ్ము చోరీ చేసేదన్నారు. ఈ క్రమంలో గత యేడాది ఫిబ్రవరినెలలో పీలేరు నుండి తిరుపతికి వచ్చే బస్సులో ఒక మహిళ వద్ద నుండి హ్యాండ్‌బ్యాగు చోరీ చేసిందని, అందులో ఉన్న నాలుగు బంగారు గాజులు, చైన్, మరో చిన్నచైన్‌తో పాటు, జత కమ్మలు కలిగిన ప్లాస్టిక్ కవర్‌ను దొంగతనం చేసిందన్నారు. మార్చి నెలలో కూడా తిరుపతి బస్టాండు వద్ద ఒక మహిళ వద్ద ఉన్న బ్యాగును తస్కరించిందని, అందులో 60వేల రూపాయలు నగదుతో పాటు ఆభరణాలను దొంగిలించుకుని పారిపోయిందన్నారు. తనకు తెలిసిన ముగ్గురు మహిళల ముఠాతో కలసి ఆటోలో తిరుపతి బస్టాండులో ఆటో ఎక్కిన ఒక మహిళ వద్ద బంగారు తాళిబొట్టు చోరీ చేసి పారిపోయిందన్నారు. తిరిగి ఒక నెలక్రితం ఖజానా బంగారు నగల షాపు వద్ద షేర్ ఆటో ఎక్కిన మహిళ వద్ద నుండి బంగారు నగలను చోరీ చేసిందన్నారు. చోరీ చేసిన ఈ ఆభరణాలను రేవతి తన ఇంట్లోనే ఉంచి వాటిని అమ్మి పంచుకోవడానికి తన ముఠా సభ్యులను కలుసుకోవడానికి మంగళవారం తిరుపతికి వచ్చిందని, తమకు అందిన సమాచారంతో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారని తెలిపారు. నిందితురాలిని పట్టుకోవడానికి కృషి చేసిన వారందరికీ రివార్డులు ఇవ్వమని ఎస్పీకి సిఫార్సు చేశామన్నారు.