క్రైమ్/లీగల్

తిరుపతిలో పుత్తూరు ఉపాధ్యాయుడు కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, ఆగస్టు 14: దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పీఏగా పనిచేసిన ఉపాధ్యాయుడు రమణను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. చాకచక్యంగా కిడ్నాపర్ల నుండి తప్పించుకుని ఇంటికి చేరుకున్న రమణను టీడీపీ నాయకులు గాలి భానుప్రకాష్ మంగళవారం పరామర్శించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో కాపురం ఉంటున్న వీరమంగళం వెంకటరమణ పుత్తూరు మండల ఇషా కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. 2014వ సంవత్సరం నుండి అనధికారికంగానే ముద్దుకృష్ణమకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఆయన తదనంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మకు సహాయంగా ఉంటున్నారు.
తిరుపతిలో కిడ్నాప్...
వెంకటరమణ సొంత పనుల నిమిత్తం సోమవారం సాయంత్రం తిరుపతికి వెళ్లారు. సంజీవయ్య పార్కు వద్ద వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి వెంకటరమణపై దాడిచేశారు. ఆయన కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశారు. కళ్లకు గంతలు కట్టి కారులో ఎక్కించుకున్నారు. చాలాసేపు కారులో ప్రయాణించిన తరువాత రామచంద్రాపురం మండల పరిధిలోని వెంకట్రామపురంలో ఒక మామిడితోటలోని ఇంట్లో బంధించారు. కిడ్నాపర్లు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ చిత్రహింసలు పెట్టారు. తన దగ్గర అంతమొత్తం లేదని వెంకటరమణ మొరపెట్టుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు. మొబైల్‌ఫోన్‌తో పాటు బంగారు ఉంగరం, మూడువేల రూపాయల నగదు లాక్కున్నారు. మంగళవారం వేకువజామున కిడ్నాపర్ల కన్నుగప్పి వెంకటరమణ తప్పించుకున్నారు. సమీపంలో పశువులు మేపే వారి వద్ద ఉన్న మొబైల్‌ఫోన్ నుండి డయల్ 100కి ఫోన్‌చేసి తాను కిడ్నాపైన సమాచారం అందించారు. కొత్తూరు రోడ్డుపైకి రాగా అంతలో పోలీసులు వెంకటరమణను గుర్తించి పుత్తూరు తీసుకువచ్చారు. విషయం తెలియడంతో ముద్దుకృష్ణమనాయుడు చిన్నకుమారుడు గాలి జగదీష్ మంగళవారం పుత్తూరులో వెంకటరమణను ఆయన స్వగృహంలో కలిసి జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర దర్యాప్తు జరిగితే దుండగుల గురించి వాస్తవాలు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.