క్రైమ్/లీగల్

చెల్లెల మరణంపై అన్న ఎస్పీకి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లూరు, ఆగస్టు 14: మండలంలోని మొగళ్లూరు గ్రామానికి చెందిన విక్టోరియా(24) మరణించడంతో ఆమెను మొగుళ్లూరులోని స్మశానవాటికలో గత నాలుగు నెలల క్రితం పూడ్చివేసిన సంఘటన జరిగింది. గత కొద్ది రోజుల క్రితం అన్న రామయ్య చెల్లెల మరణంపై అనుమానం రావడంతో సోమవారం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలు మేరకు గుడ్లూరు పోలీసులు పూడ్చిన శవాన్ని పంచనామా కోసం మంగళవారం వెలికి తీసారు. ఆ సమయంలో ఎముకలు, పుర్రె మాత్రమే భూమిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. అన్న రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ సంపత్‌కుమార్ తెలిపారు. మరణానికి సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు గుడ్లూరుకు చెందిన విక్టోరియా, మొగుళ్లూరుకు చెందిన వెంకటరావుతో ఐదు సంవత్సరాలు క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరు గత ఐదేళ్లుగా హైదరాబాద్‌లో బేల్థారి పనులు నిమిత్తం వెళ్తూ వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా కోటేశ్వరరావు అనే మేస్ర్తి ద్వారా హైదరాబాద్‌కు వెళ్లారు. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటూ పనులు చేసుకుంటూ ఉండేవారని, కొద్ది రోజుల క్రితం భార్యపై భర్తకు అనుమానం రావడంతో వారిద్దరి మధ్య కలహాలు ఏర్పడ్డాయి. విక్టోరియా మరణించిందని హైదరాబాద్ నుంచి కారులో తీసుకుని మేస్ర్తి, మరో నలుగురు వెంకటరావు బంధువులు కలిసి మొగళ్లూరుకు శవాన్ని తీసుకువచ్చి పెద్దల సమక్షంలో పూడ్చివేసారు. ఇటీవల గ్రామంలో కొంత మంది విక్టోరియాను కొట్టి చంపినట్లుగా ఎస్పీకి అన్న రామయ్య ఫిర్యాదు చేసారని, తన చెల్లెలు మరణించిన విషయాన్ని వెంకటరావును అడగగా గనే్నరుకాయతిని మరణించినట్లు మృతురాలి అన్నకు తెలిపారు. ఈ విషయంపై అనుమానం రావడంతో రామయ్య ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు విలేఖరుల సమక్షంలో ఎస్‌ఐ తెలిపారు. గుడ్లూరు పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టమ్ నిమిత్తం శవాన్ని వెలికి తీసే సమయంలో ఒంగోలు రిమ్స్ పరిశోధకులు రాజ్‌కుమార్, కందుకూరు సీఐ వెంకటేశ్వరరావు, గుడ్లూరు తహశీల్దార్ సీతారామయ్య, గుడ్లూరు పోలీసులు ఉన్నారు.