క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, ఫిబ్రవరి 23: మండలంలో పాములవాక శివారు సుర్లవానిపాలెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈసంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పాములవాక నుంచి స్కూల్ పిల్లలను తీసుకువస్తున్న బస్సును సుర్లవానిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న రామచంద్రపాలెం గ్రామానికి చెందిన వెలమల నాయుడు(22) మృతి చెందగా , బైక్ వెనుక కూర్చొన్న చెర్లోపాలెం గ్రామానికి చెందిన మహిళ సుర్ల అమ్మాజీ తీవ్రంగా గాయపడింది. గాయపడిన అమ్మాజీని 108లో చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని నర్సీపట్నం రూరల్ సి. ఐ. రేవతమ్మ పరిశీలించి ప్రమాద సంఘటనను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సి. ఐ. రేవతమ్మ తెలిపారు.