క్రైమ్/లీగల్

తుంగభద్ర నదిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఆగస్టు 14:కన్న కొడుకుల నిరాదరణకు గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మంత్రాలయం మండల పరిధిలోని కాచాపురంలో గ్రామం వద్ద ఉన్న తుంగభద్ర నది వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఎమ్మిగనూరు మండల పరిధిలోని దైవందినె్న గ్రామానికి చెందిన కురువ దానె లక్ష్మీ(70), రామన్న దంపతులకు యల్లప్ప, శేషప్ప కుమారులు. ఆ దంపతులు ఇద్దరు కుమారులకు పెళ్లి చేయడంతో పాటు తమకున్న 8 ఎకరాల పొలంలో 4 ఎకరాల చొప్పున ఇద్దరికీ సమానంగా పంచి ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఇద్దరు కొడుకులు వారి బాగోగులను విస్మరించారు. దీంతో వృద్ధ దంపతులు దాదాపు 20 ఏళ్లుగా గ్రామంలో కూలి పని చేసుకుని జీవనం సాగించారు. అయితే వయస్సు మీదపడటం, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి మంత్రాలయం చేరుకుని ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు తుంగభద్ర నది ప్రవాహం వద్దకు వెళ్లగా తొలుత వృద్ధురాలు కురువ దానె లక్ష్మీ నీటి ప్రవాహంలోకి దూకి గల్లంతైంది. దీంతో భయపడిన వృద్ధుడు రామన్న నీటి ప్రవాహంలోకి దూకలేకపోయాడు. ఇదిలా ఉండగా మాదవరం ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపిన వివరాలు మరోలా ఉన్నాయి. వృద్ధ దంపతులు కురువ దానె లక్ష్మీ, రామన్న సోమవారం రాత్రి కాచాపురంలోని వారి బంధువు వీరనాగప్ప ఇంటికి బయల్దేరారన్నారు. అయితే మార్గమధ్యంలో వృద్ధురాలు లక్ష్మీ బాత్‌రూంకు వెళ్లొస్తానని చెప్పి తుంగభద్రనది వద్దకు వెళ్లగా నీటి ప్రవాహనంలో గల్లంతైందన్నారు. మంగళవారం వారి బంధువులు తెలిపిన సమాచారం మేరకు సీఐ రాము, ఎస్‌ఐ రాజారెడ్డి సిబ్బంది తుంగభద్ర నది దగ్గరకు చేరుకుని పరశీలించారు. అయితే తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని, వృద్ధురాలి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అలాగే వృద్ధుడు రామన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.