క్రైమ్/లీగల్

నక్సలైట్ల పేరుతో చందాలకు పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, ఆగస్టు14: పక్కా సమాచారంతో నకిలీ నక్సలైట్‌ను వరంగల్ క్రైం పోలీసులు మంగళవారం హన్మకొండ బస్‌స్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి ఒక కంట్రీమేడు తపంచా, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. క్రైం డీసీపీ బి.అశోక్‌కుమార్, ఏసీపీ బాబురావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చత్తీష్‌గడ్ కు చెందిన పులాయి బానయ్య 2017నవంబర్ నుండి భూపాలపల్లి జిల్లా ఏటూర్‌నాగారంలో రాక్ స్పోకెన్ పేరుతో నడుపుతున్న ట్యూషన్ నడవక పోవడంతో అప్పుల ఊబిలో కూరుకు పోయా డు. దీంతో సులువుగా డబ్బు సంపాదించాలనే నిర్ణయంలో భాగంగా నక్సలైట్ల పేరుతో సంపన్నులను, కాంట్రాక్టర్లను బెదిరించి చందాల రూపంలో డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు. తపంచా, రెండు కత్తులను బ్యాగులో పెట్టుకుని ఉదయం ఏటూర్‌నాగారంనుండి బస్సులో బయలు దేరాడు. క్రైం డీసీపీ , ఏసీపీలకు అందిన పక్కా సమాచారంతో సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్‌రాజ్, హన్మకొండ ఎస్సై ప్రవీణ్‌కుమార్ పోలీసు సిబ్బందితో హన్మకొండ బస్‌స్టాండ్‌లో మాటువేసారు. బస్సులోనుండి బానయ్య దిగగానే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సకాలంలో అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని పోలీసు కమిషనర్ రవీందర్ అభినందించారు.