క్రైమ్/లీగల్

సీబీఐకి ఐటీ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఆగస్టు 14: గుడివాడలోని భాస్కర్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆదాయపు పన్నుశాఖ కార్యాలయంపై మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు దాడి చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటున్న వార్డు-2 ఆదాయపు పన్నుశాఖాధికారిణి లక్ష్మీనీరజను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని భార్గవి ఆటోమొబైల్స్ షాపు యజమాని గొడవర్తి ప్రసాద్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి లక్ష్మీనీరజ లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టంలేని ప్రసాద్ విశాఖపట్నంలోని సీబీఐ అధికారులను ఆశ్రయించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ప్రసాద్ రూ.20వేల లంచాన్ని లక్ష్మీనీరజకు ఇస్తుండగా సీబీఐ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రాత్రి 7గంటలకు కూడా ఆదాయపు పన్నుశాఖ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.