క్రైమ్/లీగల్

రాపూరు కేసులో నిందితులకు 29 వరకు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటగిరి, ఆగస్టు 16 : వెంకటగిరి సర్కిల్ పరిధిలోని రాపూరు పోలీస్‌స్టేషన్‌పై ఇటీవల రాపూరు దళితవాడకు చెందిన కొందరు దాడిచేసి ఎస్‌ఐతో పాటు సిబ్బందిని గాయపరిచిన కేసులో 23 మంది నిందితులకు గురువారం స్థానిక జడ్జి శోభ ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. 14 రోజులు రిమాండ్ పూర్తికావడంతో వారిని గురువారం పోలీసులు భారీ బందోబస్తు మధ్య వెంకటగిరి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే నెల్లూరుకు చెందిన న్యాయవాది అంబేడ్కర్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ గోబ్యాక్ పోలీస్ అంటూ పలువురు దళిత నాయకులతో కలిసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది అంబేడ్కర్ మాట్లాడుతూ రాపూరు కేసులో అరెస్టయిన నిందితులను రిమాండ్ పూర్తి కావడంతో కోర్టుకు హాజరుపరిచేందుకు పోలీసులు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిందితులు ఏమైనా నక్సలైట్లా, ఎర్రచందనం స్మగ్లర్లా, ఎవరినైనా హత్య చేశారా..ఎందుకు అంత బందోబస్తు ఏర్పాటు చేశారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి పద్ధతులు మానుకోవాలని సూచించారు.