క్రైమ్/లీగల్

కారు అదుపు తప్పి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, ఆగస్టు 16: ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తాకొట్టిన సంఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్ప శివారులో 63వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మాక్లూర్ ఎస్‌ఐ సాయినాథ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాస్‌నగర్‌లోని విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు బీ.టెక్ విద్యార్థులు, ఆర్మూర్‌లోని క్షత్రీయ ఇంజినీరింగ్ కళాశాలలో సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు నిజామాబాద్ నుండి ఇన్నోవా కారులో బయలుదేరారు. గుత్ప చౌరస్తా దాటిన తర్వాత మూలమలుపు వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి పల్టీకొట్టగా, నిజామాబాద్ నగరంలోని అహ్మద్‌పురాకాలనీకి చెందిన అబ్దుల్ అజీజ్(21)అనే బీ.టెక్ విద్యార్థి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మిగతా ఐదుగురు విద్యార్థులకు సైతం గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కారును అతివేగంగా నడపడంతో మూలమలుపు వద్ద కంట్రోల్ కాక అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ వెల్లడించారు. ఈ మేరకు అజీజ్ మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సాయినాథ్ తెలిపారు.