క్రైమ్/లీగల్

జీఎస్‌టీ మోసాలపై 62 కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: జంటనగరాల్లో బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తూ జీఎస్‌టీకి చెల్లించాల్సిన పన్నులను ఎగవేతకు పాల్పడుతున్న సంస్థలపై గురువారం తూనికలు కొలతల అధికారులు కొరడా ఝుళిపించారు. అధికారుల దాడుల సమయంలో వ్యాపారస్థులు దుకాణాలు బంద్ చేశారు. వ్యాపారుల మోసాలను గుర్తించిన అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టడంతో జీఎస్‌టీ మోసాలు బట్టబయలు అయ్యాయి. కేంద్రం జీఎస్‌టీని తగ్గించినా పాత ధరల ప్రకారమే వస్తువులు విక్రయించడం అధికారుల దృష్టికి వచ్చింది. ఇటీవల 28 శాతం ఉన్న జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించారు. వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారస్థులపై కేసులు బనాయించారు. జంటనగరాల్లో చాలా మంది జెఎస్‌టీపై అధిక వసూళ్ళు చేస్తున్నారని వాణిజ్య శాఖ అధికారులకు రోజూ ఫిర్యాదులు అందుతున్నాయి. దాదాపు 36 మందితో 18 బృందాలుగా వివిధ వ్యాపార వర్గాల సముదాయాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎలక్ట్రానిక్స్, రియల్‌డిజిటల్స్, బిగ్‌బజార్, లోకస్ హుంనీడ్స్, బజాజ్ హూం అప్లయెనె్సన్, కాపాల్ కంప్యూటర్స్, అబిడ్స్ మెట్రో, మోర్ సూపర్ మార్కెట్, హనుమాన్ హార్డ్‌వేర్స్‌పై 62 కేసులు నమోదు చేశారు. తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జంటనగరాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.