క్రైమ్/లీగల్

మాజీ ఉద్యోగితో కుమ్మక్కైన గ్రీన్‌టెక్ కర్మాగారం సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, ఆగస్టు 17: మండల పరిధిలోని గ్రీన్‌టెక్ కంపెనీలో ఇంటి దొంగలు నిజమేనని గతంలో మేనేజర్‌గా పనిచేసి మానేసిన వ్యక్తి, ప్రస్తుతం పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో కుమ్మక్కై భారీ చోరీకి పథకం వేశారని గూడూరు డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక సిఐ కార్యాలయంలో గ్రీన్‌టెక్ కర్మాగారంలో జరిగిన చోరీలపై విలేఖరులతో మాట్లాడారు. కంపెనీలో గతంలో పనిచేసి మానేసిన అరుణ్‌కిషోర్ అనే వ్యక్తి ప్రస్తుతం ఇనుము వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా చోరీకి పథకం పన్ని ప్రస్తుతం వేర్‌హౌస్‌లో మేనేజర్‌గా ఉన్న ప్రదీప్ అనే వ్యక్తిని తన పథంకంలో భాగం చేసుకున్నాడు. వీరిరువురి పథకం ప్రకారం ఐదు టన్నుల బరువును ఎత్తే లిఫ్ట్ ఆపరేటర్లయిన ఎస్ సురేష్, ఎం ప్రసాద్, ఉదయ్‌సాయిలతో మాట్లాడారు. ఇక్కడి వరకు లారీలోకి లోడ్ చేయగలరే గానీ, కర్మాగారం నుంచి లోడ్ చేసిన లారీ బయటకు రావాలంటే సెక్యూరిటీ విభాగం అధికారి నాగరాజు సహాయం కావాల్సి ఉంటుంది. భారీ ఎత్తున జరిగే చోరీలో లక్షల రూపాయలు చేజిక్కించుకోవచ్చనే ఆశతో నాగరాజు వీరితో చేతులు కలిపి తన ఆధీనంలో ఉన్న మరో సెక్యూరిటీ గార్డు సాంబశివరావును లోబర్చుకున్నాడు. పథకం ప్రకారం జరిగిన ఈ చోరీలో ఇప్పటి వరకు మూడు లారీల ముచి సరకు లోడు చోరీ చేయగలిగారు. ఇదే నేపథ్యంలో నాల్గవ లారీలో తరలిస్తుండగా స్థానికుల కంటపడి పోలీసులకు చిక్కారు. రంగంలోకి దిగిన పోలీసులు సరకుతో సహా లారీని స్వాధీనం చేసుకొని సురేష్, ప్రసాద్, అంకయ్య అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దీంతో వెలుగులోకి వచ్చిన చోరీలో రూ.3.75 లక్షలు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.