క్రైమ్/లీగల్

బ్యాంకు వద్ద పౌల్ట్రీ రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఆగస్టు 17: దేవరపల్లి మండలం యర్నగూడెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచి వద్ద మండలంలోని కృష్ణంపాలెంకు చెందిన పౌల్ట్రీ రైతు దుగ్గిన సుబ్రహ్మణ్యం శుక్రవారం వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణంపాలెంకు చెందిన సుబ్రహ్మణ్యం కోళ్ల ఫారం ఏర్పాటుకు 2009లో కృష్ణాజీ పౌల్ట్రీ ఫారం పేరుతో యర్నగూడెం బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి రూ.1,06,45,000లు రుణం తీసుకున్నాడు. అప్పట్నుంచీ 2012 వరకూ రూ.28 లక్షలు రుణం చెల్లించాడు. ఆ తర్వాత పౌల్ట్రీ వ్యాపారం సక్రమంగా లేకపోవటంతో వాయిదాలు చెల్లించలేకపోయాడు. తిరిగి 2013లో తన బంధువుల పేరున రూ.14 లక్షల రుణాన్ని పొందాడు. బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని సుబ్రహ్మణ్యంపై వత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో రూ.2,06,50,000లను గత సంవత్సరం అక్టోబర్ 17వ తేదీనాటికి చెల్లించాలని గడువు ఇచ్చారు. అప్పట్నుంచీ బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతూ పౌల్ట్రీ ఏర్పాటుకు తీసుకున్న రుణాన్ని చెల్లిస్తానని బ్యాంకు అధికారులకు తెలిపాడు. గత మూడు నెలల నుంచీ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా అధికారులు తనని పట్టించుకోవటం లేదని సుబ్రహ్మణ్యం వాపోయాడు. రుణం చెల్లించిన వెంటనే తనకు దస్తావేజులు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరాడు. బ్యాంకు అధికారులు మీ రుణంతోపాటు బంధువుల ద్వారా తీసుకున్న రుణాన్ని కూడా చెల్లిస్తేనే దస్తావేజులు ఇస్తామని షరతు విధించారు. దీంతో మనస్తాపానికి గురైన సుబ్రహ్మణ్యం శుక్రవారం బ్యాంకు అధికారులతో కూడా చర్చలు జరిపినా ఫలితం లేకపోవటంతో గత్యంతరం లేక వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు సుబ్రహ్మణ్యాన్ని అడ్డుకున్నారు. ఈ విషయంపై బ్యాంకు అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.