క్రైమ్/లీగల్

చందపల్లి విలీనంపై హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 17: పెద్దపల్లి మున్సిపాల్టీలో చందపల్లి గ్రామం విలీనంపై హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగర పంచాయ తీగా ఉన్న పెద్దపల్లిని మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు చుట్టు పక్కల ఉన్న రంగంపల్లి, చందపల్లి, బంధంపల్లి గ్రామాలను మున్సిపాల్టీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గతం లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 60 శాతం మందికి పైగా వ్యవసాయం జీవనాధారంగా జీవనం గడుపుతున్న చందపల్లిని మున్సిపాల్టీలో విలీనం చేయవద్దంటూ ఆ గ్రామ ఎంపీటీసీ గంగుల భారతి-వెంకటేశ్‌తో పాటు మాజీ ఉప సర్పంచు ఇప్పలపల్లి రాముల, మాజీ వార్డు సభ్యులు బత్తుల కనుకయ్య, వేల్పుల వీరేశం, రౌతు శంకర్, అనాసి విజయ్, గంగుల రాజు, నెత్తెట్ల సతీస్, తోట వెంకటేశంలు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీటీసీ ఇచ్చిన రిట్ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు పెద్దపల్లి మున్సిపాల్టీలో చందపల్లి విలీనంపై స్టే జారీ చేసింది. కాగా, ఇదే అంశంపై రంగంపల్లి విలీనంపై హైకో ర్టు స్టే జారీ చేసింది. అయితే గ్రామ పంచాయితీ పాలకవర్గం పదవి కాలం ముగిసిన నేపథ్యంలో రంగంపల్లి, బంధంపల్లి, చందపల్లి గ్రామాలకు మినహా అన్ని గ్రామ పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ ఎంపీటీసీల పదవి కాలం ముగియక పోవడంతో పాటు హైకోర్టు స్టే నేపథ్యంలో విలీన గ్రా మాల పాలనపై మున్సిపాల్టీ ఇంకా దృష్టి సారించ లేదు. ప్రత్యేక అధికారులు లేక మున్సిపాల్టీ పాలన లేక మూడు గ్రామాల ప్రజలు తమ సమస్య ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుం డా ఏకపక్ష నిర్ణయంగా మూడు గ్రా మాలను మున్సిపల్‌లో విలీనం చేయ డం పట్ల ఆయాగ్రామాల ప్రజల నుం చి సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించి మున్సిపాల్టీలో మూడు గ్రామాల విలీనంపై పునరాలోచన చేయాలని ఆయాగ్రామాల ప్రజలు కోరుతున్నారు.