క్రైమ్/లీగల్

ధిక్కార పిటిషన్‌పై అఫిడవిట్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గత నెలలో జరిగిన మూక దాడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో సుప్రీం నోటీసులు జారీ చేసింది. గోరక్షణ పేరుతో జరిగిన మూక హత్యాకాండలో రాక్బర్‌ఖాన్ (28) ప్రాణాలు కోల్పోయాడు. అల్వార్ జిల్లా రాంగఢ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రభుత్వంపై తుషార్ గాంధీ, కాంగ్రెస్ నేత తహ్‌సీన్ పూనావాలా ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్‌ను విచారించింది. రాజస్థాన్ హోమ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది. నిందితులపై ఏ చర్యలు తీసుకున్నదీ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మూక దాడిపై జూలై 17న తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు అల్వార్ ఘటన అత్యంత దుర్మార్గం, అవమానకరమైందని వ్యాఖ్యానించింది. గోరక్షకుల దురాగతాలను కట్టడి చేయాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. రాంగఢ్‌కు సంబంధించిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకున్నదీ తమకు వివరణ ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నదీ అఫిడవిట్ దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాలకు దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 7వ తేదీ నాటికి అఫిడవిట్‌లు ఇవ్వాలన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది.