క్రైమ్/లీగల్

జెనీవాకు వెళ్లేందుకు శశిథరూర్‌కు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భార్య మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ జెనీవా వెళ్లడానికి కోర్టు అనుమతి లభించింది. భార్య సునంద అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న శశిథరూర్ కేరళ వరద బాధితులకు అంతర్జాతీయ సమాజం సహాయం కోరడానికి, ఇటీవల మృతి చెందిన ఐక్యరాజ్య సమితి మాజీ కార్యదర్శి కోఫీ అన్నన్ మృతికి సంతాపం ప్రకటించడానికి తాను జెనీవా వెళ్లడానికి అనుమతించాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు తన న్యాయవాదుల ద్వారా విన్నవించుకున్నారు. అన్నన్ కింద తాను పది సంవత్సరాలు పనిచేశానని, అతను తనకు ప్రాణస్నేహితుడు, మార్గదర్శకుడని, కనుక తనకు బెయిల్ మంజరు చేయాలని ఆయన కోరాడు. దీనికి మెజిస్ట్రేట్ సమర్ విశాల్ అంగీకరిస్తూ అతను జెనీవా వెళ్లడానికి అనుమతి మంజూరు చేశారు. థరూర్ ఆగస్టు 20,21 మధ్య జెనీవా వెళ్లవచ్చునని, అయితే కేసు దర్యాప్తు అధికారికి అతని పర్యటన షెడ్యూల్‌ను సమర్పించాలని సూచించారు.