క్రైమ్/లీగల్

పశువుల ఎముకలతో కల్తీ నూనె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ ఫిబ్రవరి 23: ఖేడ్ పట్టణానికి కిలో మీటరు దూరంలో జగన్నాథ్‌పూర్ గ్రామ శివారులో రహస్య ప్రదేశంలో రేకుల షెడ్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడే బట్టి ఏర్పాటుచేసి పశువుల ఎముకలతో కల్తీ నునేను తయారు చేస్తున్న ముఠాను రహస్య సమాచారం మేరకు శుక్రవారంనాడు 12 గంటలకు దాడులు చేస్తూ పట్టుకునట్లు ఖేడ్ ఎస్ ఐ నరేందర్ విలేకరులకు తెలిపారు. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన నన్ను, ఇంట్లో రెండు కల్తీనునే డబ్బాలు, అల్లీసాబ్ వద్ద ఇంట్లోనే 4 డబ్బాల కల్తీనునే, కల్తీ నునే తయారు చేసే దోంగల ముఠా నాయకులు ఇద్దరు అన్న దములు అశ్వాక్, యూస్సేన్‌ల వద్ద పశువుల ఎముకలతో తయారు చేసిన కల్తీ నునే డాబ్బాలు వారి ఇంట్లో సోదలు జరుపగా 54 లభించాయని వాటిని స్వాధీనం చేసుకునట్లు ఎస్ ఐ చెప్పారు. అక్రమంగా పశువుల కలేబారాలతో తయారు చేస్తున్న కల్తీ నునేను హైదాబాద్ ప్రాంతాలకు తరలిస్తునట్లు వారు తెలిపినట్లు అయన తెలిపారు. నాలుగురు నిందితులను అదుపులో తీసుకుని విచారణ చేస్తునట్లు చెప్పారు. ఒక డబ్బాలో 17 లీటరు కల్తీ నునే ఉంటుందన్నారు. పశువుల వదించిన ఎముకలతో కల్తీ నునే తయారు చేస్తున్న వారిపై గోవదా నిషేధం చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తునట్లు ఎస్ ఐ నరేందర్ విలేకరులకు తెలిపారు.
వయోజన విద్యాశాఖలో నిధుల గోల్‌మాల్
వీసీఓల గౌరవ వేతనాలలో రూ.1.13కోట్లు దుర్వినియోగం
ముగ్గురు అధికారులపై చీటింగ్ కేసు నమోదు
సంగారెడ్డి రూరల్, ఫిబ్రవరి 23: ఉమ్మడి మెదక్ జిల్లాలోని వయోజన విద్యాశాలో నిధుల గోల్‌మాల్ కలకలం రేపుతొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తదనంతరం ఈ నిధుల గోల్‌మాల్ జరిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాగా కొనసాగిన సమయంలో 1077 మంది గ్రామ కోఆర్డినేటర్లు (వీసీఓ) పని చేయగా, వారికి సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల గౌరవ వేతనం కింద రూ.2వేల చొప్పున అందించడానికి నిధులు విడుదల చేసింది. జిల్లాల పునర్విభజన అనంతరం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సంబంధించి వీసీఓల సంఖ్య 1194కు పెరిగింది. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం అదనపు నిధులను విడుదల చేసింది. కాగా 2014నుండి 2016వరకు వీసీఓలకు చెల్లించాల్సిన గౌరవ వేతనాల చెల్లింపులలో నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా ఇటీవల ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ నిధుల గోల్‌మాల్ ప్రస్తుతం జిల్లాలో సంచలనం రేపుతొంది. ఉమ్మడి మెదక్ జిల్లాగా ఉన్న సమయంలో జిల్లా వందశాతం సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విధితమే. ఇదిలా ఉంటే వీసీఓల గౌరవ వేతనాలకు సంబంధించి అప్పట్లో 1,13,74,000 మేరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిధులను గత అధికారులు వారి బంధువుల ఖాతాల్లోకి మళ్లించినట్లుగా ఆ శాఖ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. నిధులు పక్కదారి పట్టిన సమయంలో వయోజన విద్యాశాఖ జిల్లా సంయుక్త సంచాలకులుగా పని చేసిన ఉషమార్త స్వర్ణలత, ఎపీఎం ఉమ, కోఆర్డినేటర్ కల్పనలపై సంబంధిత శాఖ అధికారి రామేశ్వర్‌రావు సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామక్రిష్ణారెడ్డి తెలిపారు.