క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరికి మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాండ్‌సౌర్ (ఎంపీ): ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులకు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటనపై ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పును వెలువరించింది. నిందితులు ఇర్ఫాన్ అలియాస్ భయ్యా (20), ఆసిఫ్ (24) నేరం చేసినట్లు రుజువవడంతో కొత్తగా వచ్చిన చట్టం ఐపీసీ సెక్షన్ 376 డీబీ ప్రకారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిషాగుప్తా నిందితులకు మరణశిక్ష విధించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎస్ ఠాకూర్ తెలిపారు. పనె్నండేళ్ల లోపు బాలికలపై ఒకరు లేదా అంతకు మించిన సంఖ్యలో వ్యక్తులు అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష విధించాలని ఈ కొత్త చట్టం చెబుతోంది. కాగా బాధిత బాలిక గత జూన్ 26న మాండ్‌సౌర్‌లోని పాఠశాల
నుంచి ఇంటికి బయలుదేరి తండ్రి కోసం ఎదురు చూస్తుండంగా నిందితులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక గొంతుకోసి ఆ బాలికను హత్య చేసేందుకు సైతం ప్రయత్నించారు. ఈ మానవమృగాల దౌష్ట్యంతో గొంతు, ముఖం, తలతోబాటు మర్మాంగాలపై సైతం తీవ్ర గాయాల పాలైన ఆ బాలిక ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇండియన్ పీనల్ కోడ్‌తోబాటు, బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో)కి సంబంధించిన పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. ఇలావుండగా ఈ కేసులో నిందితులకు మరణ శిక్ష పడిన అనంతరం నిందితులను కోర్టు వెలుపలికి తీసుకువస్తున్న సమయంలో ఒక వ్యక్తి వారిపై దాడికి పాల్పడ్డాడు.