క్రైమ్/లీగల్

కోమటిరెడ్డి, సంపత్‌కు హైకోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఏ సంపత్ కుమార్ సభాబహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వం రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ ధర్మాసనం రెండు నెలలు పాటు నిలిపివేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వం తరుపున ఢిల్లీకి చెందిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. దీంతో సింగిల్ బెంచ్
తీర్పుపై 2 నెలలు స్టే ఇస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనాన్ని ఇచ్చేదే. కోమటిరెట్టి, సంపత్‌కుమార్ సభాబహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. కాగా తమ తీర్పును అమలు చేయకపోవడంపై అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టు ధిక్కారణ కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం ప్రదర్శించారని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో డివిజన్ బెంచ్ తాజాగా స్టే ఇవ్వడం మరింత ప్రాధాన్యత చేకూరింది.