క్రైమ్/లీగల్

రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ వర్తించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: రాజ్యసభ ఎన్నికల్లో నోటా విధానం వర్తించదని ఈ విధానాన్ని అనుమతించడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నోటా విధానాన్ని రాజ్యసభ ఎన్నికల్లో అనుమతించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. నోటా అంటే నిర్దేశించిన అభ్యర్థుల్లో ఎవరిని ఎన్నుకోకుండా తిరస్కరించే హక్కు. పైవేవి కాదు అనే ఆఫ్షన్‌ను నోటా అంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. నోటా అనే ఆప్షన్‌ను ప్రత్యక్ష పద్ధతుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ప్రక్రియల్లోనే ఉంటుందని కోర్టు పేర్కొంది. దామాషా ప్రాతినిధ్యం కింద ఓటు బదలాయింపు ప్రక్రియ ద్వారా జరిగే ఎన్నికలకు నోటా వర్తించదని కోర్టు పేర్కొంది. ఎగువ సభలో బహిరంగ బ్యాలెట్‌కు అనుమతి ఉంది. ఇక్కడ రహస్య ఓటింగ్‌కు అవకాశం లేదు. ఇక్కడ రాజకీయ పార్టీలు, వారి సభ్యుల క్రమశిక్షణ అవసరం. నోటాను అనుమతిస్తే, ప్రతికూల ప్రభావం పడుతుంది అని సుప్రీంకోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఆ రాష్ట్రానికి ప్రతినిధి అవుతారు. అంతేకాని నియోజకవర్గానికి కాదు అని జస్టిస్ ఏఎం ఖాన్వికర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెడితే ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుంది. ఫిరాయింపులను, అవినీతిని ప్రోత్సహించినట్లవుతుందని కోర్టు పేర్కొంది. గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ విప్ శైలేష్ మనుభాయ్ పర్మార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మద్ పటేల్ గతంలో నామినేషన్ దాఖలు చేసి గెలిచిన సంగతి విదితమే. ఆ సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో నోటాను ప్రవేశపెట్టింది. దీనిని గుజరాత్ కాంగ్రెస్ నేత సవాలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెడితే ప్రజాప్రతినిధుల ఎన్నికలో బేరసారాలు ముమ్మరమవుతాయని ఆయన పిటిషన్‌లో కోరారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లేనని కోర్టు పేర్కొంది. ఓటు విలువను సర్వనాశనం చేస్తుందని, ప్రజాప్రతినిధులు పార్టీని మార్చేందుకు ప్రోత్సహించినట్లవుతుందని తీర్పులో కోర్టు పేర్కొంది.