క్రైమ్/లీగల్

పది కిలోల క్లోరోహైడ్రేట్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమకొండ, ఆగస్టు 21: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి రవీందర్‌గౌడ్ ఇంట్లో మంగళవారం పది కిలోల క్లోరోహైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు దోమకొండ ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు రవిందర్ ఇంటిపై దాడి చేసి సోదాలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన పది కిలోల క్లోరోహైడ్రేట్ లభించిదని, అనంతరం దానిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ పోతారెడ్డి, సిబ్బంది ఎల్లయ్య, కిరణ్, షాహెద్ పాల్గొన్నారు.