క్రైమ్/లీగల్

జీవో 550పై నేడు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మెడికల్ కోర్సుల కౌనె్సలింగ్ ప్రక్రియలో జీవో నెం.550పై శుక్రవారం సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వనుంది. ఈ జీవోపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ అరు ణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వైద్య విద్యా కోర్సుల కౌనె్సలింగ్‌కు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కోరింది. మెడికల్ కౌనె్సలింగ్‌లో ఓపెన్ కేటగిరి సీటును వదులుకొని రిజర్వేషన్ కోటాలో మరో సీటును దక్కించుకున్నప్పుడు ఖాళీ చేసిన సీటును అదే రిజర్వేషన్‌కు చెందిన మరో వి ద్యార్థితో భర్తీచేయాలని ఉద్దేశించబడిన జీవో నెం.550 లోని పేరా 5(2)ను ఉమ్మడి హైకోర్టు ఇటీవల తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు 16 మంది విద్యార్థులు, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం, కాళోజీ విశ్వవిద్యాలయం సుప్రీం లో పిటిషన్లు దాఖలు చేశాయి. ముందుగా తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్‌సింగ్ వాదనలు వినిపించారు.
జస్టిస్ అరుణ్ మిశ్రా జోక్యం చేసుకోని కౌనె్సలింగ్ అన్‌లైన్‌లో జరుగుతున్నప్పుడు ఒక విద్యార్థి మెరిట్ కోటాలో సీటు పొంది అంతకంటే మెరుగైన సీటుకోసం రిజర్వేషన్ కోటాలో మరోసీటు పొందాలనుకునే ప్రక్రియలో ఖాళీచేసిన వ్యక్తిని ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్, తెలంగాణ నుంచి వికాస్‌సింగ్ ధర్మాసనానికి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. వికాస్‌సింగ్ సమాధామిస్తూ కంప్యూటర్ ప్రోగ్రామర్ సాయం తీసుకుని సాంకేతికంగా వివరిస్తామని కొంత సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.