క్రైమ్/లీగల్

కటకటాల్లో కామాంధుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఆగస్టు 24: వివాహితను వేధించి, బెదిరించి, అత్యాచారం చేసిన ఓ కామాంధుడు కటకటాల వెనక్కు వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన వివాహిత మహిళ ఇంట్లో స్నానం చేస్తుండగా దొంగచాటుగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు అదే గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య (45). చిత్రీకరించిన వీడియోలను బయటపెడతానని బయపెట్టి పలుమార్లు బలత్కారం చేశాడు. అతడి బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుండగా, ఆ మహిళ జీవితాన్ని బజారున వేసేందుకు చిత్రీకరించిన అశ్లీల వీడియోలను మరో ఇద్దరి సహయంతో సామాజిక మాధ్యమాలలో ఉంచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కామాంధుడు రంగయ్యతోపాటు అందుకు సహకరించిన ఫోటోగ్రాఫర్ వరికుప్పల మహేష్ (26), డీజే ఆపరేటర్ నల్లెంకి ప్రశాంత్ (22)ను శుక్రవారం అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్‌లు, ఒక బైక్, ఒక సీపీయూను స్వాధీనం చేసుకోని సీజ్ చేశారు. చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసి న విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఏసీపీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన రంగయ్య వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో మావోయిస్టు సానుభూతి పరుడుగా పనిచేశాడు. అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ (35)పై కనే్నసాడు. ఆరేళ్ల క్రితం మహిళ ఇంట్లోని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా దొంగచాటుగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసాడు. ఆ వీడియోను అందరికీ చూపించి బతుకును బజారున వేస్తానని బెదిరించి, పలుమార్లు అత్యాచారం చేశాడు. మూడేళ్ల పాటు ఈ అకృత్యాలను కొనసాగించాడు. మహిళను బెదిరించి సారల మైసమ్మ దేవాలయం సమీపంలోని గుట్టల ప్రాంతానికి రావాలని చెప్పాడు. బయపడిన వివాహిత అతను చెప్పినట్లుగా వెళ్లింది. చెప్పినట్లు చేయకపోతే భర్త, పిల్లలను చంపుతానని బెదిరించాడు. తలవంచిన మహిళ చెప్పినట్లుగా చేసింది. అ దుర్మార్గుడు తన కోరికను తీర్చుకుంటూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసాడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు వివాహిత విఫలయత్నం చేసింది. అదే గ్రామానికి చెందిన మహేష్, నల్లెంకి ప్రశాంత్ సహా యం తీసుకోని పది రోజుల క్రితం సెల్‌ఫోన్‌లోని వీడియోలను గ్రామంలోని పలువురికి షేర్ చేశాడు. సామాజిక మాధ్యమాలలో అశ్లీల వీడియోలు మార్మోగాయి. సమాచారం తెలుసుకున్న వివాహిత పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. సమగ్ర విచారణ నిర్వహించి అందుకు బాధ్యులైన ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు.
చిత్రాలు..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ రమేష్
*నిందితుడు రంగయ్య
(ఫైల్‌ఫోటో)